-
CHRISTHU RAJYA SUVARTHA
We deliver the word of GOD through online platform by mobile phones. Please contact us to get daily GOSPELS into your mobile phones right away without any cost.
-
CHRISTHU RAJYA SUVARTHA
We deliver the word of GOD through online platform by mobile phones. Please contact us to get daily GOSPELS into your mobile phones right away without any cost.
-
GET KNOWLEDGE
Whether you are just beginning to seek Jesus or have been a believer for years, the Word of God can always speak new truths into your life!.
-
ADORE HIM
GLORY BE TO HIM, OUR CREATOR.
పరిశుద్ధ బైబిలులో చెప్పబడిన పది ఆజ్ఞలు
TEN Commandments in Telugu:
- "నీ దేవుడైన యెహోవాను నేనే. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు"
- " పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్ళయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు."
- "నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింప కూడదు."
- "విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము."
- "నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము"
- "నీవు చంపకూడదు "(చాలామంది క్రైస్తవులు తప్పుగా ఈ పదాన్ని మార్చేశారు నర హత్య చెయ్యకూడదు అని తప్పుగా తెలుగు బైబిల్ లో మార్చేశారు.)ఎక్కడ అర్ధం దేనినైనా అని .
- "వ్యభిచారం చేయకూడదు ( పెళ్ళిచేసుకొన్న వారితొ కాక మరొకరితొ రతిలొ పాల్గొనకూడదు )"
- "దొంగతనం చేయకూడదు"
- "నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుక కూడదు"
- "నీ పొరుగువాని ఇల్లు ఆశింప కూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింప కూడదు."
ఈరోజు వాక్య పఠనము ఆదికాండము 15: 16-21
16 అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ
తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.
17 మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను.
18 ఆ దినమందే యెహోవాఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నదివరకు ఈ దేశమును, అనగా
19 కేనీయు లను కనిజ్జీయులను కద్మోనీయులను
20 హిత్తీయులను పెరి జ్జీయులను రెఫాయీయులను
21 అమోరీయులను కనా నీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతాన మున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.
పై ఉన్న వచనాలలో మీకు ఏమైనా సందేహాలు ఉండిన యెడల మీరు మాకు తెలియ చేయ వలెను.